సిజెంట కంపెనీ వారి డ్రోన్ స్ప్రేయర్ అవగాహన సదస్సు

సిజెంట కంపెనీ వారి డ్రోన్ స్ప్రేయర్ అవగాహన సదస్సు

2
TMedia (Telugu News) :

సిజెంట కంపెనీ వారి డ్రోన్ స్ప్రేయర్ అవగాహన సదస్సు

టీ మీడియా సెప్టెంబర్ 16 తిరుమలాయపాలెం: ఈరోజు సింజెంటా కంపెనీ వారి ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో శుక్రవారం డ్రోన్ టెక్నాలజీ పై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింజెంట బిజినెస్ మేనేజర్ సింగంపల్లి కృష్ణం నాయుడు,ఖమ్మం మేనేజర్ మానేపల్లి శ్రీనివాసు కంపెనీ ప్రతినిధులు జాల రవి అనిక రామకృష్ణ మూడు నాగేశ్వరావు గుండా వినోద్ టీఎస్ ఓ వాడియా వెంకన్న పాల్గొన్నారు.

Also Read : వై.ఎస్.ఆర్.టి.పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా మహేష్

ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతులు ముందుకు వెళ్లాలి డ్రోన్ స్ప్రేయర్ ద్వారా రైతులు పురుగుమందు పిచికారి చేయడం వలన కేవలం 7 నిమిషాలలో ఒక ఎకరానికి పిచికారి చేయవచ్చు అలాగే పురుగుమందు నీ 30% ఆదా చేసుకోవడమే గాక ఒక సంవత్సరానికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం మిగులుతుందని రైతులకు తెలియజేశారు అలాగే వివిధ పంటల్లో కూడా డ్రోన్ స్ప్రేయర్ ఉపయోగించుకోవచ్చని తెలియజేశా ఈ కార్యక్రమానికి కొక్కిరేణి ఎర్రగడ్డ తాళ్ళచెరువు రైతులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube