నామ వల్లనే ఎండిన పంటలు బతికాయి

నేడు వైరా ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది..

0
TMedia (Telugu News) :

నామ వల్లనే ఎండిన పంటలు బతికాయి
– నేడు వైరా ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది..
-కాంగ్రెస్ ఉంటే ఇది సాధ్యమయ్యేదా ?..
-సి ఏం కెసిఆర్

టి మీడియా, నవంబర్ 21,వైరా : సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు పై సీఎం కేసీఆర్ గారి ప్రశoసల జల్లు
వైరా సభా వేదికపై కూడా మధిరలో లాగే ఎంపీ నామ నాగేశ్వరరావు రైతు సేవలపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించి, ఆయన వైపు చూస్తూ రైతులకు చేసిన సేవలను వేలాది మంది ప్రజల సాక్షిగా గుర్తు చేశారు.. కేసీఆర్ గారు ఏం అన్నారో ఆయన మాటల్లో చూద్దాం…. ” ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు ఈ మధ్య నన్ను కలిశారు…వైరా ప్రాజెక్టు లో నీటి నిల్వలు లేక ప్రాజెక్టు కాల్వల కింద వేసిన పంటలు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని నామ గారు ఎంతో ఆవేదనతో చెప్పారు… వెంటనే నేను అధికారులతో మాట్లాడి, ప్రాజెక్టులోకి నీటిని వదలడం జరిగింది.. ఇప్పుడు ప్రాజెక్టు నీటితో బ్రహ్మాండంగా ఉంది.. పంటలకు సాగునీటి సమస్య కూడా తీరిపోయిందని సీఎం కేసీఆర్ నామ నాగేశ్వరరావు గారి సేవలను వేదికపై ప్రజలకు వివరించడం గమనార్హం.

Also Read : మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సిఎం జగన్‌

అదే కాంగ్రెస్ ఉంటే ఇది సాధ్యమా అని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ఆరేడు నెలల్లో పూర్తి అవుతుంది. ఇంకా 30 శాతం పనులే మిగిలాయి.. ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సంపూర్ణoగా సస్యశ్యామలం అవుతుంది.. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి… మదన్ లాల్ కు ఓటేసి గెలిపించాలని కేసీఆర్ వైరా నియోజకవర్గ ప్రజల్ని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube