డీఎస్పీ దారుణ హత్య

మైనింగ్ మాఫియా పనే!_

1
TMedia (Telugu News) :

డీఎస్పీ దారుణ హత్య

-మైనింగ్ మాఫియా పనే!_

టి మీడియా,జూలై20,హరియాణా:దారుణం జరిగింది. నుహ్​లో అక్రమ మైనింగ్​పై విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్​ని లారీతో ఢీకొట్టి హత్యచేశారు. పోలీసు అధికారిని ఢీకొట్టిన తర్వాత నిందితుడు పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.

 

Also Read : రీడింగ్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

 

రాతి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై డీఎస్పీ సురేంద్ర సింగ్ విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా తావడూ సమీపంలోని పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్​ను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. దారిలో వెళ్తున్న ఓ లారీని ఆపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. అయితే, లారీ డ్రైవర్ ఇవేవీ పట్టించుకోకుండా పోలీసుపైకి వాహనాన్ని పోనిచ్చాడు. మంగళవారం ఉదయం 11.50 గంటలకు ఈ ఘటన జరిగింది. డీఎస్పీ​ వెంట ఆయన గన్​మన్, డ్రైవర్ ఉన్నారు. లారీ దూసుకొచ్చిన సమయంలో ఇరువురూ పక్కకు దూకేశారు. డీఎస్పీ తప్పించుకోలేకపోయారు. లారీ ఢీకొట్టిన వెంటనే డీఎస్పీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు వివరించారు. ట్రక్కు డ్రైవర్​ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

Also Read : గోదావరికి కరకట్ట నిర్మించండి

కొద్దిరోజుల్లో రిటైర్మెంట్.. ఆలోపే..

1994లో హరియాణా పోలీసు విభాగంలో చేరారు సురేంద్ర సింగ్ బిష్ణోయ్. అసిస్టెంట్ సబ్ఇన్​స్పెక్టర్​గా విధుల్లో చేరిన ఆయన క్రమంగా డీఎస్పీ స్థాయికి ఎదిగారు. హిసార్ జిల్లాలోని సారంగ్​పుర్ ఆయన సొంత ఊరు కాగా.. ప్రస్తుతం కురుక్షేత్రలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కొద్దినెలల్లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఆలోపే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. డీఎస్​పీ మృతిని ధ్రువీకరించిన హరియాణా పోలీసు విభాగం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube