నకిలీ విత్తనాలు, ఎరువులతో మోసం చేస్తే ఉపేక్షించేది లేద

-అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ

1
TMedia (Telugu News) :

నకిలీ విత్తనాలు, ఎరువులతో మోసం చేస్తే ఉపేక్షించేది లేద

-అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ.

టి మీడియా,జూన్24,ఖమ్మం క్రైం:వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలకు అండగా అధికారులు…నకిలీ దందాల కట్టడికి పోలీస్ వ్యవసాయ శాఖ సంయుక్త దాడులు చేసారు.అక్రమ్ర రవాణా మార్గాలపై దృష్టి…నకిలీ, అధిక ధరలకు అంటగడుతున్న వారిపై నిఘా దాడులు ముమ్మరంచేశారు.పోలీస్ అధికారుల సమావేశం చేశారు. ఈ మేరకు. పోలీస్ కమిషనర్ దిశనిర్ధశం చేశారు.పోలీస్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్స్ దుకాణాలలో విస్తృత తనిఖీలు చేశారు.నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.ఈరోజు పోలీస్ అధికారులతో సమావేశమైన పోలీస్ కమిషనర్ అధికారులకు దిశనిర్ధేశం చేశారు. పోలీస్ స్టేషన్ వారిగా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంతో విస్తృతంగా పర్యటించి విత్తనాలు, ఎరువుల షాపులను తనిఖీ చేయాలని సూచించారు.పంటల సీజన్‌ పరిస్థితులను ఆవకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండాపోలీసువ్యవసాయసంయుక్తఎన్‌ఫోర్స్‌మెంట్‌విభాగంప్రత్యేకకార్యాచరణకుఉపక్రమించిందన్నారు.వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానుండటంతో అన్నదాతలకు అండగా నిలుస్తూ..విత్తనాలు అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు.విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాలను కట్టడి చేయాలని అన్నారు.

Also Read : స్పెషల్ ఆఫీసర్ తనిఖీ

ప్రధానంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై పోలీసులు దృష్టి సారించిందని, ఇతర రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు అక్కడి నుంచి జిల్లాలోకి తరలించకుండా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలపై అధికారులు పటిష్ట నిఘా పెట్టారని తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, రానున్న రోజుల్లో ప్రత్యేక బృందాల ద్వారా మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. షాపుల యజమానులు తప్పనిసరిగా రికార్డులు నిర్వహించాలన్నారు.
రైతులకు నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను విక్రయించి వారి ఉన్నతికి తోడ్పడాలని ఫర్టిలైజర్ షాప్స్, విత్తనాలు అమ్మే దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.

 

Also Read : గోల్డ్ మాఫియా దాష్టీకం

నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మిన, సరఫరా చేసిన, కొనుగోలు చేసిన ఏటువంటి సమాచారం తెలిసిన స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శభరీష్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీలు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్ , రామోజీ రమేష్ , సిఐలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube