జాతీయ పురస్కారం అందుకున్న దుర్గం నగేష్

0
TMedia (Telugu News) :

టి మీడియా డిసెంబర్ 11 వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ మహాత్మ జ్యోతిరావు పూలే 2021జాతీయ అవార్డుకు ఎంపికైనారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని పంచశీల ఆశ్రమం లో జరిగిన 37వ దళిత రైటర్స్ కాన్ఫరెన్స్‌లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్పీ సుమనాక్షర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ అకాడమీ జాతీయ అధ్యక్షుడు ఎస్పీ సుమనాక్షర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం దళిత సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ప్రజా ఉద్యమ కారులకు, సంఘ సేవలకు, రచయితలకు, కవులకు, కళాకారులకు, ఈ అవార్డు అందజేస్తున్నట్లు తెలియజేశారు. దేశంలోనే 29 రాష్ట్రల నుండే కాక ఇతర దేశాల నుండి వేల సంఖ్యలో డెలిగేట్స్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అవార్డు గ్రహీత దుర్గం నగేష్ మాట్లాడుతూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర మారుమూల గ్రామంలో జన్మించిన నాకు మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉందని అవార్డు ప్రధానంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. సమతా సైనిక దళ్ , సమతా ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలు గుర్తించి ఈ అత్యున్నత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును నాకు అందజేసిన భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్పీ సుమనాక్షర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందత్ మనూ కృతజ్ఞతలు తెలియజేశారు.

Durgam Nagesh receives national award.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube