దసరా మహోత్సవాలు ప్రారంభం

దసరా మహోత్సవాలు ప్రారంభం

1
TMedia (Telugu News) :

దసరా మహోత్సవాలు ప్రారంభం

టీ మీడియా,సెప్టెంబర్ 26, హైద‌రాబాద్ : శ్రీశైలం మ‌హాక్షేత్రంలో ద‌స‌రా మ‌హోత్స‌వాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు.అక్టోబ‌ర్ 5వ తేదీతో ద‌స‌రా ఉత్స‌వాలు ముగియ‌నున్నాయి.

Also Read : ప్రభాస్‌-మారుతి మూవీలో బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో?

ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌తిరోజు శ్రీస్వామి అమ్మ‌వార్ల‌కు విశేష పూజ‌లు, వాహ‌న‌సేవ‌లు, అమ్మ‌వారికి న‌వ‌దుర్గ అలంక‌ర‌ణ‌లు చేయ‌నున్నారు. లోక క‌ల్యాణం కోసం ప్ర‌తిరోజు జ‌పాలు, పారాయ‌ణాలు, రుద్ర‌యాగం, చండీయాగం నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ భ్ర‌మ‌రాంభ దేవి ఉత్స‌వ‌మూర్తికి శైల‌పుత్రి అలంకారం చేయ‌నున్నారు. స్వామి అమ్మ‌వార్ల‌కు భృంగి వాహ‌న‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube