పెండింగ్ ఈ చలాన్ల రాయితీ పై అవగాహన

పెండింగ్ ఈ చలాన్ల రాయితీ పై అవగాహన

1
TMedia (Telugu News) :

పెండింగ్ ఈ చలాన్ల రాయితీ పై అవగాహన
టీ మీడియా,మార్చి 14, రామగుండం:గోదావరిఖని ఓల్డ్ అశోక్ థియేటర్ జంక్షన్ వద్ద ఆదివారం  వాహనదారులకు పలు ట్రాఫిక్ అంశాలను వివరిస్తూరామగుండం ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకటేశ్వర బాబు, హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ టూ వీలర్, త్రి వీలర్ పెండింగ్ ఈ చలానా రాయితీలు 75% ,ఆర్టీసీ డ్రైవర్లకు రాయితీ 50% ,మాస్క్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రాయితీ 90% ప్రభుత్వం,పోలీసు శాఖ కల్పిస్తుందని.ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకొని పెండింగ్ చలానాలు చెల్లించాలని తెలిపారు.అలాగే ప్రతి వాహనదారుడు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సూచించారు.ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర బాబు, హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్,ట్రాఫిక్ కానిస్టేబుల్ అశోక్ ,సుమారు 20 మంది వాహనదారులు పాల్గొన్నారు.

Also Read : ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube