ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం

ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం

0
TMedia (Telugu News) :

ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం

– చంద్రబాబు, పవన్‌

టీ మీడియా, జనవరి 9, విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌లు, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో భేటీ అయ్యారు. వీరితో పాటు బిజెపి, సీపీఎం, బీఎస్పీ, ఆప్‌ నేతలు హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబాబు, పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలన్నారు. ఆరు వేల నుంచి ఏడు వేల ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నిస్తే బైండోవర్‌ కేసులతో ప్రతి పక్షాలను వేదిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Also Read : ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం.. 6.7 తీవ్రత

తమ కార్యకర్తలను పనిచేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటువేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థ రాజ్యంగ వ్యతిరేకం అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్లాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube