రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి

ఏ ఈ ఓ.త్రిసంద్యా

1
TMedia (Telugu News) :

రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి
– ఏ ఈ ఓ.త్రిసంద్యా
టీ మీడియా,మే 23, జన్నారం:రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి అని ఏఈఓ త్రిసంధ్య అన్నారు. సోమవారం రోజున మండలంలోని చింతలపల్లి గ్రామంలో రైతులకు ఈ కేవైసీ కార్యక్రమం నిర్వహించారు పీఎం కిసాన్ 11వ విడత రూపాయిలు 2000 జమ చేయాలంటే ప్రభుత్వం కొత్తగా ఈ కేవైసీ చేసుకోవాలని నిర్ణయించిందని, ఈ ప్రక్రియ రైతులు 31/05/2022 వరకు పూర్తి చేసుకోవాలని, లేనియెడల డబ్బులు జమ చేయడం జరగదని తెలియజేశారు.

Also Read : పెండ్లి ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

పీఎం కిసాన్ లింకు ద్వారా గాని మీ సేవలో గాని రైతులు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లచ్చన్న,ఉప సర్పంచ్ ఇప్ప లక్ష్మి, రైతులు రాకేష్, కిష్టయ్య, రాజయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube