డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ

డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ

1
TMedia (Telugu News) :

డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ

టీ మీడియా, జూన్ 22, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ వనపర్తి జిల్లా రేషన్ డీలర్లకు త్రీ జి నుండి 4g ఈపాస్ మిషన్లు పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్లు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు బచ్చురాము వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఈపాస్ మిషన్లు ఇవ్వడం జరిగింది.

Also Read : కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్న రెడ్ కో చైర్మన్‌ స‌తీశ్ రెడ్డి

ఈపాస్ మిషన్ నుండి గతంలో నెట్ ప్రాబ్లం చాలా ఉన్నది సరుకులు ప్రజలకు రెండు మూడు రోజులు అవుతున్నది. కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉండాలని తక్కువ సమయంలో త్వరగా ఇవ్వడానికి త్రీ జి నుండి 4g ఈపాస్ మిషన్లు జిల్లా 325 మంది గ్రామాలకు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున ప్రతి ఒక్క లబ్ధిదారుడు రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకోవాల్సిందిగా ఈనెల 27వ తేదీ వరకు చివరి తేదీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు దగ్గర్లో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి బియ్యం కోట తీసుకోవాల్సిందిగా వనపర్తి జిల్లా అధ్యక్షులు బచ్చురాము కోరారు.

Also Read : ‘మీ అహంకారం 4 రోజులే

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు నరేష్,నాగ రాఘవేంద్ర, అమ్మపల్లి అర్జున్, పాన్గల్ మండల అధ్యక్షులు శివరామ గుప్త, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, గత 45 సంవత్సరాల నుండి రేషన్ పంపిణీ చేయడంలో వనపర్తి జిల్లా బండారు రాములు, ఇటుకూరి వెంకటయ్య ప్రజలకు రేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు రేషన్ డీలర్లు కరోనా సమయంలో సమయంలో ప్రాణాలకు లెక్కచేయకుండా ప్రజలు పస్తులు ఉండడానికి వీల్లేదని రేషన్ డీలర్లు ముందుకు వచ్చి రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. వనపర్తి జిల్లా రేషన్ డీలర్ల దాదాపు నుండి డీలర్లు చనిపోయినారు డీలర్లకు ఇన్సూరెన్స్ కింద 20 లక్షల రూపాయలు ఇవ్వ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube