శీతాకాలం ఆల‌స్య‌మైనా.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది

శీతాకాలం ఆల‌స్య‌మైనా.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది

0
TMedia (Telugu News) :

శీతాకాలం ఆల‌స్య‌మైనా.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది

– ప్ర‌ధాని మోదీ

టీ మీడియా, డిసెంబర్ 4, న్యూఢిల్లీ: నేటి నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ మీడియాతో మాట్లాడారు. శీతాకాలం ఆస‌ల్య‌మైనా.. దేశంలో మాత్రం రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతున్న‌ట్లు ఆయ‌న అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయ‌న్నారు. మ‌హిళ‌లు, యువ‌త‌, రైతులు, పేద‌ల ప‌క్షాన ఉన్న వారికి అనూహ్య‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌న్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌నిచేయాల‌న్న త‌ప‌న ఉంటే, అప్పుడు ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉండ‌ద‌ని మోదీ అన్నారు. దేశంలో ఇప్పుడు ప్ర‌భుత్వ అనుకూల‌త‌, సుప‌రిపాల‌న‌, పార‌ద‌ర్శ‌క‌త ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ద్వేష‌భావాన్ని దేశం తిర‌స్క‌రించింద‌న్నారు. ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌జాస్వామ్య ఆల‌య‌మే కీల‌కం అన్నారు.

Also Read : గంట కరెంటు ఆగినా వెంటాడుతాం వేటాడుతాం

పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు వ‌చ్చే స‌భ్యులంద‌రూ ప్రిపేరు కావాల‌ని, బిల్లుల గురించి స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆశిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. స‌భ‌లు స‌జావుగా సాగేందుకు ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించాల‌న్నారు. కొత్త పార్ల‌మెంట్‌లో ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ఆశిస్తున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube