ఉత్తరాఖండ్‌లో భూకంపం.. 4.5 తీవ్రత

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. 4.5 తీవ్రత

1
TMedia (Telugu News) :

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. 4.5 తీవ్రత

టీ మీడియా,నవంబర్6,న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.

Also Read : పాపికొండల విహారయాత్రకు గ్రీన్‌సిగ్నల్

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube