మెక్సికోను వణికించిన భారీ భూకంపం..

7.4 తీవ్రతతో ప్రకంపనలు

1
TMedia (Telugu News) :

మెక్సికోను వణికించిన భారీ భూకంపం..

– 7.4 తీవ్రతతో ప్రకంపనలు

టీ మీడియా,సెప్టెంబర్ 20,మెక్సికో సిటీ : మెక్సికోలోని సెంట్రల్‌ పసిఫిక్‌ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు ఆదేశ జాతీయ భూకంప శాస్త్రసంస్థ నివేదించగా.. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే 7.6గా అంచనా వేసింది. పసిఫిక్ తీరంలోని మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు మెక్సికన్ భూకంప శాస్త్రవేత్తల పేర్కొన్నారు.

Also Read : స్కూల్‌పై ఆర్మీ హెలికాప్ట‌ర్ ఫైరింగ్‌

మెక్సికోలోని మిచోకాన్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపంతో కోలోకోమన్‌ పట్టణంలో భవనాలు పగుళ్లుబారాయి. భారీ ప్రకంపన ధాటికి భవనాలు వణికిపోగా.. జనం భయంతో పరుగులు పెట్టారు. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షీన్‌బాయ్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. 1985, 2017 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మెక్సికోలో భూకంపాలు నమోదయ్యాయి.

Also Read : ఇండెన్ గ్యాస్ వినియోగదారుల కు అవగాహన సదస్సు

మళ్లీ అదే రోజు భారీ ప్రకంపనలు రావడం ప్రస్తావనార్హం. సెప్టెంబర్‌ 19, 1985న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. 2017లో రిక్టర్‌ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూమి కంపించగా.. 370 మంది ప్రాణాలు కోల్పోయారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube