ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం

ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం

0
TMedia (Telugu News) :

ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం

టీ మీడియా, డిసెంబర్ 12, న్యూఢిల్లీ : ఆఫ్ఘానిస్థాన్‌ మరోసారి భూకంపం తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. కాగా, ఇటీవలే కాలంలో ఆప్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో సంభవించిన భూకంపం దేశంలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో 2 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Also Read : వారిని మసీదులోకి అనుమతించాల్సిందే

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube