భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు
టీ మీడియా, జనవరి 16, ఇండోనేషియా : ఇండోనేషియాలో వారం రోజుల వ్యవధిలో మరో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 6:30 గంటలకు సుమత్రా దీవుల్లో భూమి కంపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదు అయింది. 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇండోనేషియా వాతావరణ సంస్థ ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. భూకంప కారణంగా ప్రజలు భయకంపింతులు అయ్యారు. ‘ఎసెహ్, దక్షిణ సుమత్రాలోని నాలుగు జిల్లాల్లో మాత్రమే భూమి కంపించింది. అది కూడా 3 నుంచి 10 సెకన్లు అంతే’ అని ఆ దేశ వాతావరణ కేంద్ర ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించాడు. వారం క్రితం తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది.
Also Read : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్
ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, ఆగ్నిపర్వతాలు బద్ధలు కావడం జరగుతుది. అందుకు కారణం ఆ దేశం, పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడమే. అందుకనే తరచూ భూ పలకలు ఢీకొంటాయి. దాంతో, భూకంపం, అగ్నిపర్వతం పేలుళ్లు వంటివి సంభవిస్తాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube