దేశంలోని పలుచోట్ల భూకంపాలు

దేశంలోని పలుచోట్ల భూకంపాలు

0
TMedia (Telugu News) :

దేశంలోని పలుచోట్ల భూకంపాలు

టీ మీడియా, ఫిబ్రవరి 13,న్యూఢిల్లీ : దేశంలోని పలుచోట్ల భూకంపాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌, ఘజియాబాద్‌, పంజాబ్‌, గురుగ్రామ్‌, నోయిడాల్లో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
ఇళ్ల నుండి పరుగులు తీసిన జనం…
దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు. భూకంపం వచ్చిన సమయంలో పలు శబ్దాలు కూడా వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, వెంటనే తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెబుతున్నారు.

Also Read : విజయవాడలో నూతన సిపిఎం రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లోనూ భూకంపం
ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లోనూ ఈ భూకంపం చోటు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణాన 79 కిమీ దూరంలో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీని ప్రభావం పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వరకు కనిపించింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భూమి కంపించింది.
ఆఫ్ఘన్‌లో 200 కిలోమీటర్ల లోతున భూకంపం…
ఆప్ఘన్‌లోనిహిందూ ఖుష్‌ పర్వత ప్రాంతాల్లో భూమికి 200 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube