ఎల‌క్ష‌న్ ప్ర‌చార ధ‌ర‌ల ప‌ట్టిక‌ను విడుద‌ల చేసిన ఈసీ

ఎల‌క్ష‌న్ ప్ర‌చార ధ‌ర‌ల ప‌ట్టిక‌ను విడుద‌ల చేసిన ఈసీ

0
TMedia (Telugu News) :

ఎల‌క్ష‌న్ ప్ర‌చార ధ‌ర‌ల ప‌ట్టిక‌ను విడుద‌ల చేసిన ఈసీ

టీ మీడియా, అక్టోబర్ 12, హైద‌రాబాద్ : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల్లో కచ్చితత్వం కోసం పలు చర్యలు చేపట్టింది. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా ధరల జాబితా విడుదల చేసింది. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తల కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీ.. తదితర వాటికి దేనికెంత అనే వివరాలతో పట్టిక రూపొందించింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చుల లెక్కలు చూపించాలని పేర్కొంది. ఈ ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ధరలు ఇలా ఉన్నాయి..

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్ణ‌యించిన ధ‌ర‌ల ప‌ట్టిక :
ఫంక్షన్ హాల్ రూ.15,000
భారీ బెలూన్ రూ. 4,000
ఎల్ఈడీ తెర రూ.15,000
డీసీఎం వ్యాన్ రూ. 3,000
మినీ బస్సు రూ.3,500, పెద్ద బస్సు రూ.6,000
ఇన్నోవా రూ. 6,000
డ్రోన్ కెమెరా రూ.5,000

Also Read : అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు

పెద్ద సమోసా రూ.10
లీటర్ వాటర్ బాటిల్ రూ.20
పులిహోర రూ.30 (గ్రామీణ ప్రాంతంలో రూ.20)
టిఫిన్ రూ.35 (గ్రామీణ ప్రాంతంలో రూ.30)
సాదా భోజనం రూ.80
వెజిటబుల్ బిర్యానీ రూ.80 (గ్రామాల్లో రూ.70)
చికెన్ బిర్యానీ రూ.140 (గ్రామాల్లో రూ.100)
మటన్ బిర్యానీ రూ.180 (గ్రామీణ ప్రాంతంలో రూ.150)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube