గుంటూరు, విజయవాడ ఆస్పత్రులపై ఈడీ దాడులు

గుంటూరు, విజయవాడ ఆస్పత్రులపై ఈడీ దాడులు

1
TMedia (Telugu News) :

గుంటూరు, విజయవాడ ఆస్పత్రులపై ఈడీ దాడులు

టీ మీడియా, డిసెంబర్ 2, అమరావతి : ఏపీలోని గుంటూరు, విజయవాడలోని పలు ఆస్పత్రులు, పలువురి ఇళ్లపై శుక్రవారం ఈడీ, ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గుంటూరులోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా వీడిపోయి సోదాలు నిర్వహించారు. ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించారు. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాత మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇళ్లలోనూ సోదాలు చేశారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిలో ఈడీ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ దాడులు కొనసాగాయి. కొవిడ్‌ సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించిన అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

Also Read : స్కూల్ పాఠ్యాంశంగా పునీత్ రాజ్‌కుమార్‌ జీవితచరిత్ర

సుమారు 1500 మంది కొవిడ్‌ కేసులకు చెందిన వివరాలను నమోదు చేయాలేదని వారికి కంప్యూటర్‌ రసీదులు కాకుండా మాన్యువల్‌ రసీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని కేసులు నమోదు అయ్యాయి. ఆస్పత్రుల నిర్వహణకు వచ్చిన నిధులు పక్కదారి పట్టించి ఇతర భవనాల కోసం వెచ్చించినట్లు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధిన ఫీజుల విషయంలో నిధుల గోల్‌మాల్‌ జరిగిందని గుర్తించిన అధికారులు ఆ దిశగా నిర్వాహకులపై దాడులు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube