హైదరాబాద్‌లో ఈడీ దాడులు

ఒకేసారి 8 చోట్ల సోదాలు

1
TMedia (Telugu News) :

హైదరాబాద్‌లో ఈడీ దాడులు

-ఒకేసారి 8 చోట్ల సోదాలు
టి మీడియా, జూలై27,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్‌, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వీరిద్దరిపై విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి, ఐఎస్‌ సదన్‌లోని చీకొటి ప్రవీణ్‌ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.

 

Also Read : స్వతంత్రంగా ఆలోచిస్తే కేసిర్ సహించరు

వీరు నేపాల్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారుహైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లను తరలించి.. అటునుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube