జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. భారీగా ఆస్తుల అటాచ్‌

జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. భారీగా ఆస్తుల అటాచ్‌

1
TMedia (Telugu News) :

జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. భారీగా ఆస్తుల అటాచ్‌

టీ మీడియా, నవంబర్ 30, హైదరాబాద్‌: మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు సంబంధించి ప్రభాకర్‌ రెడ్డి కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను కూడా అటాచ్‌ చేసింది. వీటిలో దివాకర్‌ రోడ్‌లైన్స్‌, జటధా ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో ఆస్తులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొన్నది. జటధర ఇండస్ట్రీస్‌, గోపాల్‌రెడ్డి అండ్‌ కో బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేసిందని చెప్పారు. వాటి రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Also Read : తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే : సీఎం జగన్

గడువు తీరి విక్రయం కాకుండా ఉన్న 154 లారీలను నాగాలాండ్‌లో స్క్రాప్ కింద కోనుగోలు చేశారు. వాటిని 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని ఇతరులకు విక్రయించారు. మరికొన్నింటిని జేసీ కంపెనీ నిర్వహిస్తుంది. అయితే ఈ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు.. నకిలీ పత్రాలతో తమకు కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసిన ఈడీ.. విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జేసీ సోదరుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube