కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
– పార్టీ ఎమ్మెల్యేలతో ఆప్ చీఫ్ భేటీ
టీ మీడియా, నవంబర్ 6, న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఇటీవల తనకు సమన్లు జారీ చేసిన నేపధ్యంలో ఆప్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను నవంబర్ 2న హాజరు కావాలని సమన్లలో ఈడీ కోరింది. అయితే తనపై రాజకీయ కక్ష సాధింపుతోనే సమన్లు జారీ చేశారని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈడీ తనకు సమన్లు జారీ చేసిందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది.
Also Read : ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి నేతల్లో తొలిగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆప్ నేతలు ఇటీవల కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube