కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు..
– అరెస్టు చేస్తారంటున్న బీజేపీ
టీ మీడియా, అక్టోబర్ 31, న్యూఢిల్లీ : లిక్కర్ పాలసీ కసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంతో ఆప్, బీజేపీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. మద్యం కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను నవంబర్ 2న హాజరు కావాలని సమన్లలో ఈడీ కోరింది. ఆప్‌ను తుదముట్టించాలనే కాషాయ పార్టీ లక్ష్యంగా చేసుకుందని, అందుకే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిందని ఆప్ దుయ్యబట్టింది. అయితే లిక్కర్ స్కామ్‌కు కేజ్రీవాల్ సూత్రధారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయను అరెస్టు చేసే ఛాన్స్ ఉందని ప్రచారం చేస్తోంది. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాషాయ పార్టీ డిమాండ్ చేసింది. ఆప్‌ను నిర్మూలించాలనే కుయుక్తితో కేంద్రం వ్యవహరిస్తోందని, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా అందివచ్చే అవకాశాన్ని బీజేపీ నేతలు విడిచిపెట్టడం లేదని, కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టి ఆప్ ఉనికి లేకుండా చేసేందుకు ఆప్ అధినేతపై తప్పుడు కేసు బనాయించారని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు.
Also Read : చంద్రబాబు మధ్యంతర బెయిల్
ఎలాగైనా కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్రలకు తెరలేపిందని ఆప్ నేత సందీప్ పాఠక్ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడ్డు తొలగించుకోవడమే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, ఢిల్లీ, పంజాబ్‌లో ఈ దిశగా ప్రయత్నాలు చేసి భంగపడ్డారని, గుజరాత్‌లోనూ ఆప్ కాలు మోపడంతో కాషాయ పాలకులకు దిక్కుతోచడం లేదని ధ్వజమెత్తారు. మరోవైపు ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతూ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పీకల్లోతు కూరుకుపోయారని, తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube