తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే : సీఎం జగన్
తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే : సీఎం జగన్
తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే : సీఎం జగన్
టీ మీడియా, నవంబర్ 30, అన్నమయ్య జిల్లా : తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని అన్నారు సీఎం జగన్. చదువుతో పేదరికం దూరం చేయొచ్చన్న సీఎం.. దేశంలో ఎక్కడా జగనన్న అమ్మఒడి లాంటి పథకాలు లేవని చెప్పారు. గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని గుర్తుచేసిన జగన్.. తమ హయాంలో పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాల తీరు దారుణంగా ఉందని, విపక్షాలకు ఆలోచనా శక్తి, వివేకం కొరవడిందని మండిపడ్డారు. పెత్తందారులంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నాలుగో విడత విద్యాదీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
Also Read : అభివృద్ధి పనులు పరిశిలించిన కార్పొరేటర్ కర్నాటి
బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల 6 వేల 243 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు. 6 వందల 93 కోట్ల 79 లక్షల నగదును.. అర్హులైన 9 లక్షల 85 వేల 360 మంది తల్లుల ఖాతాల్లో జమ చేశారు.