విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

- ఎమ్మెల్యే కి వినతి పత్రాన్నిఅందజేసిన ఎస్ఎఫ్ఐ నేతలు

0
TMedia (Telugu News) :

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

– ఎమ్మెల్యే కి వినతి పత్రాన్నిఅందజేసిన ఎస్ఎఫ్ఐ నేతలు

టీ మీడియా, డిసెంబర్ 28, వనపర్తి బ్యూరో : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మెగా రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోనూ,వనపర్తి నియోజకవర్గంలో విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,792 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచడం వల్ల విద్యార్థులు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలి.

Also Read : ప్రజా పరిపాలనా కార్యక్రమం ప్రారంభం

ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి,పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేసి విద్యారంగా అభివృద్ధికి కృషిచేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము.అంతకు ముందు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే మెగా రెడ్డి కి ఎస్ఎఫ్ఐ బృందం పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు యుగేందర్, మల్లేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube