తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతమయింది

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0
TMedia (Telugu News) :

తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతమయింది

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని హరిజన వార్డులో విద్యార్థులకు టిఫిన్ పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యత, హాజరు, ఉత్తీర్ణత శాతం పెరిగింది.దేశంలో ప్రధాన సమస్య కులవ్యవస్థ, పేదరికం ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నది.ప్లాస్టిక్ అన్ని దేశాలలో ఉన్నది.పర్యావరణ సమస్య అన్ని దేశాలలో ఉన్నది. పచ్చదనం, అటవీ శాతం సమస్య అన్ని దేశాలలో ఉన్నది.

వీటన్నింటిని జయించుకుంటూ ఆయా దేశాలు ముందుకు సాగుతున్నాయి.ప్రపంచంలోనే ఎక్కడా లేని కులవ్యవస్థ సమస్య భారతదేశంలో ఉన్నది. అటువంటి జాడ్యాన్ని తొలగించగలిగేది పాఠశాల మాత్రమే.అందుకే అందరిలో సమభావన పెంచడానికే పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించడం జరిగింది. పాఠశాలలో పుస్తకాలతో పాటు విద్యార్థులు ఈ సమాజాన్ని అధ్యయనం చేయాలి. ప్రజల స్థితిగతులను, పరిసరాలను అధ్యయనం చేయాలి.ఎవరు ఏం మాట్లాడుతున్నారు ? దేని గురించి మాట్లాడుతున్నారు ? ఏ పదాలు వాడుతున్నారు ? అన్నది అనుక్షణం గమనించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులుగా ఉన్నప్పుడే ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మేధో పరమైన అధ్యాపకులకు సమాజంలో ఉన్నతమైన గౌరవ ఉంటుంది.ప్రపంచానికి తెలియని విషయాన్ని తెలుసుకుని పదిమందిని నడపగలిగిన వారే నాయకుడు. పదిమందికి తెలిసిన విషయం కూడా తెలియని వారు ప్రజలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు. దక్షత, విజ్ఞత ఉన్నప్పుడే ఈ వ్యవస్థ ముందుకుపోతుంది.

Also Read : ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగాలి

అన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.మన ఊరు – మన బడి పథకం కింద పాఠశాలలు, వాటిలో మౌళిక వసతులను మెరుగు పరచడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు ఒక భ్రమ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. పోటీ పరీక్షలలో చురుకైన యువత బయటకు వస్తుండడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.వివిధ పనుల రీత్యా తల్లితండ్రులు వెళ్లడంతో తినకుండా పాఠశాలలకు వస్తున్న విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోతున్న సమస్యను గుర్తించి పెద్దమందడి మండలం చిన్నమందడిలో గతం నుండే సర్పంచ్ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఏర్పాటుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాణ్యమైన సన్నబియ్యం అన్నంతో మధ్యాహ్న భోజనంతో పాటు, విద్యార్థులకు ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేష్ గౌడ్ కౌన్సిలర్లు సత్యమ్మ ,లక్ష్మి నారాయణ, పాకనటి కృష్ణయ్య, నక్క రాములు ,నాయకులు కృష్ణ యాదవ్, బీరయ్య, నక్క మహేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube