ఎన్నికల ప్రచార వాహనం బోల్తా

ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

0
TMedia (Telugu News) :

ఎన్నికల ప్రచార వాహనం బోల్తా

– ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

టీ మీడియా, నవంబర్ 6, భోపాల్‌: ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రెహ్లి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గోపాల్ భార్గవ కోసం ప్రచారంలో నిమగ్నమైన ఎస్‌యూవీలో ఎనిమిది మంది కార్యకర్తలు ప్రయాణించారు. శనివారం సాయంత్రం బార్‌గ్రోన్ బర్ఖెడా, జోన్ గ్రామాల మధ్య వేగంగా వెళ్తున్న ఆ వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలో ఉన్న ఎనిమిది మంది గాయపడ్డారు. అలాగే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

Also Read : చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఎనిమిది మంది వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెహ్లీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ త్రిపాఠి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube