బీసీ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26 వనపర్తి : తెలంగాణ బీసీ మహిళా సంఘ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలిగా అడ్డాకుల మండలం చిన్నమునగల్చేడ్ గ్రామానికి చెందిన పాలవాది హారతి నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా హారతి మాట్లాడుతూ జిల్లాలో మహిళలను చైతన్యవంతం చేసి బీసీల హక్కులపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తన మీద నమ్మకంతో జిల్లా బాధ్యత అప్పజెప్పిన రాచాల యుగేందర్ గౌడ్ కి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Palavadi Harathi from Chinnamunagalched village in Addakula zone.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube