రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌

రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌

1
TMedia (Telugu News) :

రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌
టి మీడియా,మే 5,న్యూఢిల్లీ : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్ర‌కాశ్‌.. త‌న రాజ్య‌స‌భ స్థానానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ రాజ్య‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువ‌డిందమే 12న కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నుంది. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ మే 19. మే 30న ఉద‌యం 9 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించి, అనంత‌రం ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

Also Read : చండీయాగంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube