కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి
– రాజ్యాంగం హక్కులను ప్రజలకు చేరవేయాలి
– ప్రజా సంఘాలు.ఐక్యవేదిక వనపర్తి జిల్లా
టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : దళితవాడలో నిర్వహించిన ఒక సమావేశంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిఐటియు కార్యదర్శి గోపాలకృష్ణ, ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, మిద్దె నాగష్,బీఎస్పీ నాయకులు వెంకటేష్, చటమోని రాము, ఆంజనేయులు, రమేష్ తదితరులు ప్రసంగిస్తూ అన్ని సక్రమంగా చేస్తా మంటున్న మోడీ మరి కులగణనను ఎందుకు చేయడం లేదు. బీహార్ రాష్ట్రంలో కుల గణన చేసి చూపించారు కదా వారు చేసిన పని దేశం మొత్తం ఎందుకు చేయడం లేదని, మొదట కులగలను చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు ప్రశ్నించారు.
Also Read : దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే
ఈ రోజున రెండు మూడు శాతం ఉన్న కులాలలో 70% వరకు పదవులు అనుభవిస్తున్నారని, 85 శాతం ఉన్న ప్రజలు 10 శాతం చట్టసభలలో ఉంటున్నారని, దీనివలన సమన్యాయం జరిగేలా లేదని దీనిపై దేశం మొత్తం జాగృతం చేయాలని, ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉండీ వారి హక్కులను కాపాడవలసిన అవసరం ఉందని దానిలో భాగంగా కుల గణన చేపట్టి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును మేమే చేశామని సంకలు గుద్దుకోకుండా ఈ కులగలను చేసి ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీలకు సత్వర అవకాశాలను కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు ఒక్కనించారు.ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా త్వరలో ఉద్యమానికి శ్రీకారం చూద్దామని అలాగే రాష్ట్ర మొత్తం మీద దీనిపై ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube