ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన.?? ఘటనలో ఒకరు మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

1
TMedia (Telugu News) :

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన.?? ఘటనలో ఒకరు మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

టీ మీడియా, ఏప్రిల్ 21,నిజామాబాద్ : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుభాష్ నగర్ ప్రాంతంలో నివాసముండే బల్ల రామస్వామి (80 )తన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని ఎప్పటి మాదిరిగానే ఈ నెల 19వ తేదీన రాత్రి 12 గంటల సమయంలో చార్జింగ్ పెట్టి కుటుంబ సభ్యులు అందరూ పడుకున్నారు. అయితే 19వ తేదీ తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బ్యాటరీ లో నుండి మంటలు చెలరేగడంతో హాల్లో ఉన్న బల్ల రామస్వామి అతని భార్య కమలమ్మ కోడలు కృష్ణవేణి మనుమడు కళ్యాణ్ కు తీవ్ర గాయాలయ్యాయి.

Also Read : అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌

తీవ్ర గాయాలైన నలుగురిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా రామస్వామి బుధవారం ఉదయం మరణించినట్లు తెలిపారు. అయితే స్వల్ప గాయాలైన మరో ముగ్గురు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ వాహనం గత సంవత్సరంన్నర క్రితం కొనుగోలు చేశారని, ఎప్పటి మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ చేస్తుండే వారమని ఇది ఎలా జరిగిందో తెలియదని, రామస్వామి కుమారుడు బల్ల ప్రకాష్ తెలిపారు. బల్ల ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube