ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ నూతన కమిటీకి ఎస్ఐ భరోసా కల్పించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 23,కరకగూడెం;

ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ నూతన కమిటీకి ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ భరోసా కల్పించాలని ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన కమిటీ ఎన్నిక అయిన తర్వాత వారిని కలవడం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రోజు రాజేశ్వరరావు అన్నారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…కరకగూడెం మండలంలో ప్రవేట్ ఎలక్ట్రిషన్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని ఆయన అన్నారు.
మండలంలో ఇళ్లల్లో ఎలక్ట్రికల్ సమస్య వస్తే 24 గంటలు అందుబాటులో ఉంటున్నారని వారి సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సేరు శ్రీధర్, కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు పోగు రాము, కోశాధికారి కొమరం సతీష్, పురుషోత్తం, సత్యం, రవి, భగత్ సింగ్ ,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube