ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక పాలసీ : మంత్రి కేటీఆర్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక పాలసీ : మంత్రి కేటీఆర్

0
TMedia (Telugu News) :

   ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక పాలసీ : మంత్రి కేటీఆర్

టీ మీడియా, ఏప్రిల్ 24, సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్‌లో మహింద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌న్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ తరుణంలో మంత్రి మాట్లాడుతూ రూ.1000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మున్ముందు ప్లాంట్‌ను మరింతగా విస్తరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నామన్నారు. జహీరాబాద్‌లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సాహించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 23 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

 

AlsoRead:జీవో నం 1పై ముగిసిన విచారణ.. సుప్రీం కీలక ఆదేశాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube