విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి

ఏపీ రైతు సంఘం డిమాండ్

1
TMedia (Telugu News) :

విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి

-ఏపీ రైతు సంఘం డిమాండ్

టీ మీడియా, ఆగస్టు 10,మహానంది: మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెల 8 వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టసవరణ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ఏపీ రైతుసంఘం అధ్వర్యంలో గాజులపల్లే విద్యుత్ సబ్ స్టేషన్ ముందు చట్టంసవరణ బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ పార్లమెంటులో విద్యుత్ చట్టాసవరణ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా బిల్లును ప్రవేశ పెట్టారు.ఈ బిల్లు వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, రైతులపై విపరీతమైన భారం పడతాయన్నారు.విద్యుత్ పై ఉన్నటువంటి సబ్సిడీలన్ని రద్దు అవుతాయి.

 

Also Read : ఐబీ హెచ్చరికలు

 

పలితంగా వ్యవసాయానికి ఈచ్చే బిల్లు కూడా రద్దు అవుతుందని అన్నారు.ఇప్పటికే మన రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టె కార్యక్రమం జరుగుతుందని ,ఈ చట్టం వల్ల దీనికి మరింత బలం చేకూరుతుందని ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందదని విద్యుత్ ఉద్యోగులకు ఉపాధి పోతుందని ప్రైవేట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తారు.కావున బిల్లును రద్దు చేయాలని కోరుతు రాష్ట్రములో ఉచిత విద్యుత్ కొనసాగించాలని ఎస్సీ, ఎస్టీ లకూ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని ,మీటర్లు బిగించరాదని కోరారు. బిల్లు రద్దు అయ్యె వరకూ ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కోటకొండ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ, రైతుసంఘం నాయకులు సి.నాగరాజు, నాగార్జున, మద్దిలేటి,సుగాలిరాజ నాయక్,ఎన్. ఆంజనేయులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube