గంట కరెంటు ఆగినా వెంటాడుతాం వేటాడుతాం

- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

0
TMedia (Telugu News) :

గంట కరెంటు ఆగినా వెంటాడుతాం వేటాడుతాం

– మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 4, వనపర్తి బ్యూరో : ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుబంధు ఇవ్వాలి వ్యవసాయం ఆగదు. గెలిచినప్పుడు ఎగరలేదు. ఓడినప్పుడు బాధపడను.నా ఓటమి నన్ను బాధపెట్టలేదు నేను ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోను.ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం బాగా కలచివేసింది.ఆలా జరిగి ఉండాల్సిది కాదు.రాష్ట్ర సాధనలో ఎలాంటి పాత్ర లేనివారు 10 ఏండ్ల తరువాత ఒక మంచి నాయకుడిని ఓడించాలన్న కసి కనిపించింది. ప్రధాన మంత్రి గా పోటీ చేసిన ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ఎందరో సిఎం అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఓడిపోయామని ఎక్కడికి వెళ్లను.ఇక్కడే ఉంటా గ్రామాల్లో తిరుగుతా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తాం.వనపర్తి నియోజకవర్గంలో మనసు పెట్టి చేసిన అభివృద్ధి 100 ఏండ్ల భవిష్యత్తు కు సంబందించిన పని అది ప్రజల కండ్ల ముందు ఉన్నది.సుమారు సంవత్సర కాలం నుండి పార్టీలో ఉండి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేశారు.రేపు వాళ్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు అందులో ఉండే కష్ట నష్టాలు తెలుస్తాయి. ఆచరణ సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ వాళ్లు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోస పోయాము అనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. నాలుగు ఐదు నెలలో ప్రజలకు నిజం తెలుస్తుంది. ప్రజలకు అర్థం అయ్యే వరకు జరిగే నష్టం మొత్తం జరిగిపోతుంది. ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పకుండా వ్యక్తిగత కక్షలతో ఉన్నవారు విజయాలను సాధించలేరు. 100 ఏండ్ల తరువాత పారుతున్న కాల్వలు పండుతున్న పంట పొలాలు, కనిపిస్తున్న విద్యాసంస్థలు, ఏదుల రిజర్వాయర్, మార్కెట్ యార్డు మమ్మల్ని గుర్తు చేస్తాయి. నన్ను మరిపించడం ఎవరి తరం కాదు నాలుగు ఐదు సార్లు ఉన్నవాళ్లు కూడా చేయలేని పనిని చేశాను. గుడ్డిగా వ్యతిరేకించడం మాకు తెలియదు హుందాగా రాజకీయాలు చేసినం చేస్తాం. ఫలితాలను సమీక్షించుకుంటాం ప్రజల కోణం తెలుసుకుంటాం. వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన నా మీద బాధ్యత ఉండే 90 శాతం రైతు రుణమాఫీ చేసినం, రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఎన్నికలు ఉన్నాయని రైతుబంధు ఇవ్వకుండా ఆపివేశారు.యాసంగి సీజన్ ఎన్నికల కోసం ఆగదు 75 లక్షల మంది రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.

Also Read : ఏకపక్ష’ ఫలితాలు ఆందోళకరం

15 వేలు ఇవ్వాలి, మిగిలిన రైతు రుణమాఫీని వారం రోజుల్లో పూర్తి చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా డిమాండ్ చేస్తున్నా.నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరికి ధన్యవాదాలు తెలిపారు.వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు తిరుమల మహేష్, జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా శిక్షణ తరగతుల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్లు, ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube