బాల కార్మికులకు విముక్తి.

బాల కార్మికులకు విముక్తి.

1
TMedia (Telugu News) :

బాల కార్మికులకు విముక్తి.
టి మీడియా, జూలై 16,జగిత్యాలప్రతినిధి:

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి, తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగానిర్వహించడం జరుగుతుంది.ఇందులో బాగంగా జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలో శివం ఆటో వర్క్ షాప్ లో బాలకార్మికు లచే పని చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎ హెచ్ టి యు.ఇన్స్పెక్టర్ కిరణ్ అద్వర్యంలో ఎస్ ఐ రహీమ్ మరయు చైల్డ్ లైన్ ,లేబర్ డిపార్ట్మెంట్ వారితో తో ప్రత్యేక బృందగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిం చారు.ఇందులో భాగంగా నలుగురు బాలకార్మికులను గుర్తించి వారిని,సి డబ్ల్యు సి.ముందు హాజరు పరచడం జరిగింది. అనంతరం సంబదిత యాజమాన్యం పై చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.

 

Also Read : 24 గంటలు ఉచిత సేవ

ఈ సందర్బం గా ఏ హెచ్ టి యు,ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా వుందని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా అందరు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా చిన్నారులతో వెట్టిచాకిరి చేయించుకోవడం చట్యరీత్యానేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ తనిఖీల లో ఎస్.ఐ లు రహీం,రవీందర్ లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ నుండి శ్రవణ్, రాజేష్, ఐ సి టి ఎస్. నుండి శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube