ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

1
TMedia (Telugu News) :

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

టీ మీడియా, డిసెంబర్ 7, చింతూరు : తుమ్మల. నారాయణపురం గ్రామాలలో గత రెండు సంవత్సరములుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ తుమ్మల సచివాలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తుమ్మల సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి దేవి ప్రియ కు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ నాయకులు మొట్టు oరాజయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీల పేమెంట్లను 15 రోజులలో చెల్లించేలా చట్టం చేసినా కానీ అమలు కావడం లేదన్నారు. సచివాలయ పరిధిలోని నారాయణపురం గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని మరమ్మతుకు గురైన మోటర్ ను తక్షణమే బాగు చేయించి ప్రజలకు త్రాగునీ అందివ్వాలని అన్నారు.

Also Read : సి.ఎం సభకు తరలిన టి.ఆర్.ఎస్ శ్రేణులు

వీధిలైట్లను ఏర్పాటు చేయాలని,నారాయణపురం గ్రామంలో విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని ప్రజలు ప్రమాదాన్ని గురయ్యే అవకాశం ఉన్నందున ఆ సమస్యను కూడాపరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల సవలం పంతులు, మొట్టం రవికుమార్, పట్రా రాధాకృష్ణ. కోర దుర్గారావు , కురసా సుబ్బారావు.రవ్వ బుచ్చయ్య.మడకంలక్ష్మయ్య, సోడే నాగయ్య, పొడియం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube