ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం : రాహుల్‌

ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం : రాహుల్‌

0
TMedia (Telugu News) :

ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం : రాహుల్‌
టి మీడియా,ఏప్రిల్ 27, ఢిల్లీ :దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మ‌ళ్లీ మండిప‌డ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్ట‌ర్‌స్ట్రోక్స్‌తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు త‌మ ఆశ‌ను కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రాహుల్ తీవ్రంగా మండిప‌డ్డారు.ఈ ఘ‌నత వ‌హించిన మొట్ట మొద‌టి ప్ర‌ధాని మోదీయే అంటూ రాహుల్ చుర‌క‌లంటించారు. ప్రతి ఇంట్లో ఓ నిరుద్యోగి.. ఇంటింటా నిరుద్యోగం హ‌ర్ ఘ‌ర్ బేరోజ్‌గారీ… ఘ‌ర్ ఘ‌ర్ బేరోజ్‌గారీ) ఇదే ఇప్ప‌టి నినాద‌మ‌ని రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా దెప్పి పొడిచారు.”ప్ర‌ధాని మోదీ ఇచ్చిన మాస్ట‌ర్ స్ట్రోక్స్‌తో 45 కోట్ల నిరుద్యోగులు ఉద్యోగంపై ఆశ‌లు కోల్పోయారు. 75 సంవ‌త్స‌రాల్లో ఇలా చేసిన ప్ర‌ధాని ఈయ‌న‌దే. గ‌త ఐదేళ్ల‌లో 2.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. 45 కోట్ల మంది ఉద్యోగాల వెతుకులాట‌నే మానేశారు” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

Also Read:సు డా పరిధిలో ఉన్న పంచాయతీలు ప్లానింగ్ ఇవ్వాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube