ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

1
TMedia (Telugu News) :

ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

టీ మీడియా, నవంబర్ 26, రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్‌లోని పెమెరా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.

Also Read : బీఎల్ సంతోష్‌కు ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే

ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని బీజాపూర్‌ ఎస్పీ ఆంజనేయ వర్షిణి తెలిపారు. ఘటనా స్థంలో లభించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube