పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ముష్కరుడు హతం

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ముష్కరుడు హతం

0
TMedia (Telugu News) :

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ముష్కరుడు హతం

టీ మీడియా, డిసెంబర్ 1, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మేరకు గురువారం రాత్రి పుల్వామా జిల్లా అరిహల్‌లోని న్యూ కాలనీలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధం, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడిని గుర్తించాల్సి ఉన్నదని, అతడు ఏ ఉగ్రసంస్థకు పనిచేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు.

Also Read : చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం..

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube