ఎన్‌కౌంటర్.. గాయపడిన ఆరుగురు మావోయిస్టులు
టీ మీడియా, మార్చ్ 9, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకునాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సక్లార్ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఐదు నుంచి ఆరుగురు మావోయిస్టులు గాయపడ్డారు. సంఘటన స్థలంలో పెద్దసంఖ్యలో బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నదని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ గత నెల 25న ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
Also Read : వలసదారుల అడ్డుకట్టకు సునాక్ కొత్త బిల్లు
కాల్పుల్లో ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వారి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube