సేంద్రియ, సహజ వ్యవసాయంలో ఇస్తున్న ప్రోత్సహాలేమిటీ ?

- కొత్త విధానం రూపొందించారా

0
TMedia (Telugu News) :

సేంద్రియ, సహజ వ్యవసాయంలో ఇస్తున్న ప్రోత్సహాలేమిటీ ?
– కొత్త విధానం రూపొందించారా ?
– లోక్ సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వక ప్రశ్న

టీ మీడియా, డిసెంబర్ 20, న్యూఢిల్లీ : దేశంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందని రాష్ట్రాల వారీగా వివరాలు తెలియజేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్ సభలో మంగళవారం ఎంపీ నామ ఈ విషయమై లికితపూర్వకంగా కేంద్రానికి ప్రశ్నలు సంధించారు.సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన వివరాలను రాష్ట్రం, యూటీల వారీగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు సంబంధించి గత మూడు సంవత్సరాలలో మంజూరు చేయబడిన, వినియోగించబడిన నిధుల వివరాలను వెల్లడించాలని కోరారు. దేశంలో సహజ వ్యవసాయం అభివృద్ధికి తీసుకున్న చర్యలతో పాటు సహజ వ్యవసాయంలో నిమగ్నమైన రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించాలని కోరారు.
సహజ వ్యవసాయంలో నిమగ్నమైన రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏవిధమైన తీసుకున్న చర్యలు తీసుకున్నదని అన్నారు.

Also Read : బొమ్మ గిదేందమ్మా

సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని రూపొందించిందా ? అని నిలదీశారు. అదే నిజమైతే ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రతిపాదించిన కాల వ్యవధి, రైతులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో తెలియజేయాలని నామ కేంద్రాన్ని కోరారు. అయితే రాష్ట్రాల వారీగా సమాచారం అడిగినా ఇవ్వకపోవడం పట్ల నామ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి సమాధానం

ఈ విషయమై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖా మంత్రి అర్జున్ ముండా సమాధానం ఇస్తూ సేంద్రియ వ్యవసాయo, ఉత్పత్తుల్లో భారత దేశం గణనీయమైన సామర్ధ్యాన్ని కలిగి ఉన్నదని చెప్పారు. గ్లోబల్ మార్కెట్ లో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా 2001లో థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ( ఎన్పిఒపి ) పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పరంపరగత్ కృషి వికాస్ యోజన ( పికెవివై ) , మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకాల ద్వారా ప్రభుత్వం 2015-16 నుండి దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఈశాన్య (ఎన్ఈ ) రాష్ట్రాలు కాకుండా ఇతర అన్ని రాష్ట్రాల్లో పికెవిపి పథకాన్ని అమలు చేయబడుతోందన్నారు.

Also Read : పీఠంపై నువ్వా..నేనా.

అయితే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకాన్ని నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అమలు చేయబడుతోందని పేర్కొన్నారు. ఈ రెండు పథకాలు సేంద్రీయ వ్యవసాయంలో నిమగ్నమైన రైతులకు ఎండ్-టు-ఎండ్ మద్దతుగా నిలిచాయన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్, ధృవీకరణ , మార్కెటింగ్, పంట అనంతర నిర్వహణ వరకు రైతును ప్రోత్సహిo చినట్లు చెప్పారు. శిక్షణ , సామర్థ్య పెంపు పథకంలో అంతర్భాగం అన్నారు. సేంద్రియ ఎరువులు, ఎరువులను ఉత్పత్తి చేయడానికి, వాడడానికి రైతులకు ఇన్సెంటీవ్‌లు ఇందులో అంతర్నిర్మితంగా ఉంటాయని చెప్పారు. పీకేవివై పధకం ఉప పధకమైన భారతీయ ప్రకృతిక్ క్రిస్ పద్ధతి పధకం ( బీపీకేపీ) కింద 2019 -2020 నుంచి సహజ వ్యవసాయం కోసం విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని వివిధ పథకాల గురించి కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube