తెలంగాణ లో మునిగి సిన రాహుల్‌ జోడో యాత్ర

12 రోజులు, 375 కిలో మీటర్లు

1
TMedia (Telugu News) :

తెలంగాణ లో మునిగి సిన రాహుల్‌ జోడో యాత్ర

-12 రోజులు, 375 కిలో మీటర్లు

– యాత్ర తో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్యాహం

టీ మీడియా,నవంబర్ 7,హైదరాబాద్‌/సంగారెడ్డి : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో సోమవారం 12వ రోజు ఈ యాత్ర ముగిసి.. మహారాష్ట్రలోకి అడుగు పెట్టింది ప్రజలతో మమేకమయ్యేందుకు, వివిధ వర్గాల వారితో మాట్లాడేందుకు రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధ చూపడం.. సామాన్య ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహావివిధ వర్గాల ముఖ్యులు భాగస్వామ్యం కావడం యాత్రకు కొత్త శోభను తెచ్చింది. మొత్తంగా 2023 శాసనసభ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ 12 రోజులు రాష్ట్రంలో ఉండటం, 375 కిలోమీటర్ల మేర నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించడం నూతనోత్తేజాన్ని నింపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో 10 సభల్లో మాట్లాడిన రాహుల్‌గాంధీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేసే మార్పుల గురించి వివరించారు. రాష్ట్రంలో ధరణి సమస్యలు, పోడు భూముల వివాదం, చేనేత, బీడీ కార్మికులు ఇబ్బందులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల లేమి సహా అనేక అంశాలను ప్రస్తావించారు. ఆయా వర్గాలతో చర్చలు జరిపారు. రాజధానిలో జోడోయాత్ర ప్రత్యేకంగా నిలిచింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే ఈ యాత్ర సాగినా రాహుల్‌ ఏ సభలోనూ ఆ ప్రస్తావనను తేలేదు

.Also Read : నిష్పక్షపాతంగా దివ్యాంగుల లోన్ల లాటరీ

60వ రోజు..

అక్టోబరు 23న కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో రాహుల్‌ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అనంతరం దీపావళి నేపథ్యంలో మూడు రోజులు యాత్రకు విరామం ఇవ్వగా గత నెల 27 నుంచి మళ్లీ ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల మీదుగా సాగింది. మొత్తం 8 జిల్లాలు, 7 లోక్‌సభ స్థానాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్ర సోమవారం (యాత్రలో 60వ రోజు.. రాష్ట్రంలో 12వ రోజు) మహారాష్ట్రలో అడుగుపెట్టింది

ముఖ్య నేతలంతా యాత్రలో

యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జాతీయస్థాయి ముఖ్య నాయకులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌, మధుయాస్కీ, షబ్బీర్‌అలీ, వంశీచంద్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబు రాష్ట్ర, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా మిగిలినవారంతా భాగస్వాములయ్యారు. నావికాదళం మాజీ అధిపతి అడ్మిరల్‌ రాందాస్‌, సినీనటులు పూజాభట్‌, పూనంకౌర్‌ యాత్రలో పాల్గొన్నారు.

Also Read : గుణ‌తిల‌క‌ను స‌స్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు

ఆదివారం యాత్ర సాగిందిలా..

ఆదివారం ఉదయం 6.20 గంటలకు రాహుల్‌ సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్‌ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. మద్దతుగా సామాజిక కార్యకర్త యోగేంద్రయాదవ్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు రాహుల్‌ వెంట నడిచారు. ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలపాలని మందకృష్ణ కోరారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామన్న తెరాస ఇప్పటికీ ఆ పని చేయలేదని రైతులు రాహుల్‌ దృష్టికి తెచ్చారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా నుంచి సింగరేణి కార్మికులు వచ్చి జోడో యాత్రకు మద్దతు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మహిళా బీడీ కార్మికులతో రాహుల్‌ మాట్లాడారు. పెద్దశంకరంపేటలో కోయిలకొండ యాదగిరి ఇంట్లో ఉ.8 గంటల సమయంలో రాహుల్‌ తేనీరు తాగారు. యాదగిరి మనవడు కార్తికేయదత్త(11) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని.. చికిత్సకు హామీ ఇచ్చారు. 9 గంటలకు చింతల లక్ష్మాపూర్‌ చేరుకొని విరామం తీసుకున్నారు. ఆ సమయంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ బృందం రాహుల్‌ని కలిసి.. బీసీల బిల్లుకు మద్దతు కోరింది. సా.4 గంటలకు రాహుల్‌ తిరిగి నడక ప్రారంభించారు. 6.40 గంటలకు కల్హేర్‌ మండలం మహదేవపల్లి శివారుకు యాత్ర చేరుకుంది. అక్కడి నుంచి వాహనాల్లో రాత్రి బసకు కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం పెద్దకొడపగల్‌కు వెళ్లారు. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం ఫత్లాపూర్‌ నుంచి మహారాష్ట్రలోని దెగ్లూర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.మధ్యలో మద్నూరు మండలం మేనూరు వద్ద భారత్‌ జోడో గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

రాహుల్‌.. ఈ దేశ ప్రజల ఆశాదీపం

మేనూరు సభను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ కోరారు. ఉదయం పాదయాత్ర విరామం తర్వాత ఆయన సీఎల్పీ నేత భట్టితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలందరికీ రాహుల్‌ ఆశాదీపంలా కనిపిస్తున్నారని, ఆయన చేపట్టిన ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రజలు ఆయనలో ఒక నెల్సన్‌ మండేలాని చూస్తున్నారన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube