ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణా కార్యక్రమం

ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణా కార్యక్రమం

1
TMedia (Telugu News) :

ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణా కార్యక్రమం
టీ మీడియా, ఏప్రిల్ 27, భద్రాచలం:ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల కు ,అజీమ్ ప్రేమ్ జీ, ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ల ద్వారా రెండవ రోజు ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణా కార్యక్రమం ద్వారా పలురకాల అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని డిడి ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవి అన్నారు.మంగళవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణలో భాగంగా సంబంధిత ఉపాధ్యాయులను ,గ్రూపుల వారీగా చేసి ఇంగ్లీష్ భాష సంబంధించిన వీడియో ప్రదర్శించారు.అనంతరం ఉపాధ్యాయులను గ్రూపుల వా రి గా చేసి ఈ వీడియో ద్వారా తిలకించిన ఇంగ్లీష్ పదాలను ఉపాధ్యాయులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించిన అనంతరం దానికి సంబంధించిన నోట్స్ ను తయారుచేసి గ్రూపుల వారీగా దానికి సంబంధించిన సబ్జెక్టులను తోటి గ్రూపులకు తెలియజేసి ఏమైనా అనుమానం ఉంటే అప్పటికప్పుడే ఇంగ్లీషు సంబంధించిన పదాలను సంబంధిత ప్రొఫెసర్ నడిగి సమస్యను పరిష్క రించి సమస్యను నివృత్తిచేసుకున్నారు.

 

Also Read : దళిత బంధును లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలి

 

అనంతరం అజీమ్ ప్రేమ్ జి ఇన్స్ట్యూట్, సంబంధించిన ప్రొఫెసర్ పల్లవి, ఆ కార్డ్ సెల్ ఓ ఎస్ డి రామ్ లాల్ ఇంగ్లీషు భాష యొక్క ప్రాముఖ్యాన్ని దానికి సంబంధించిన పదాలను విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు.ముఖ్యంగా ఇంగ్లీష్ భాష అనేది నేర్చుకోవడం చాలా సులభమని దానికి సంబంధించిన పదాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటే తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా సులభంగా అవగతం చేసుకోవచ్చని వారు ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ సీఎం రమణయ్య, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, అసిస్టెంట్ ఏ సీఎం ఓ బావ సింగ్, క్రీడల అధికారి డాక్టర్ వీరు నాయక్, మరియు వివిధ పాఠశాల నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube