పర్యావరణం పై అవగాహన సదస్సు

గుడ్డ సంచులు విద్యార్థులకు పంపిణీ

0
TMedia (Telugu News) :

పర్యావరణం పై అవగాహన సదస్సు

-గుడ్డ సంచులు విద్యార్థులకు పంపిణీ

టి మీడియా,నవంబర్ 15,ఖమ్మం : పందిళ్ళపల్లి గ్రామం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో శ్రీ గురుపాదుకాపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణం పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్. కడవెండి వేణుగోపాల్ సామాజికవేత్త మరియు పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత , వీరితోపాటు పోతుగంటి సేవా సంఘం అధ్యక్షులు పోతుగంటి వెంకటేశ్వర్లు , డాక్టర్. పగిడిపల్లి రాజారావు , స్కూలు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది . ఈ సందర్బంగా డా కడవెండి వేణుగోపాల్ మాట్లాడుతూ పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక , రసాయనిక , జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిమాణంలో పోగయ్యాయి , పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తోంది అని తెలియ జేశారు . పర్యావరణం అంటే అర్థం భూమి , నీరు , గాలి , చెట్లు , జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి . అందుకనే మనమంతా మెరుగైన భవిష్యత్ కోసం ఈ కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుందని కడవెండి పేర్కొన్నారు . ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని తెలిసి కూడా విచ్చలవిడిగా వాడుతున్నారు . క్యాన్సర్ కారకం , శ్వాసకోశ వ్యాధులు , రక్తంలో కూడా ప్లాస్టిక్ ఉన్నదని తెలిసినా ప్లాస్టిక్ వాడకం మానటం లేదని , స్వచ్ఛమైనవి తల్లిపాలు అవి తాగి మనము పెరిగి పెద్దవాళ్లమై చదువుకొని విజ్ఞానవంతులమై విచ్చలవిడిగా ఆ ప్లాస్టిక్ ని వాడి ఇప్పుడు ఆ తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ కణాలు ఉన్నవని శాస్త్రవేత్తలు , డాక్టర్లు చెబుతుంటే ఎంతో బాధగా ఉందన్నారు .

Also Read నిత్యవసర సరుకులు అందించిన సోనుసూద్ వీరఅభిమాని

అయినా అర్థం చేసుకోవటం లేదు ప్రజలు , ప్రభుత్వాలు , అధికారులు ,గాలి కాలుష్యం ,నీరు కాలుష్యం , భూమి కాలుష్యం అవుతున్నది . తద్వారా అనారోగ్యాల పాలు అవుతున్నారు . ఇంకా ఇది ఎన్నాళ్లు భావితరాలకు భరోసా ఏమిటి ? ఎన్ని శతాబ్దాలు అయినా ఇంకా అవగాహన కలిగించడమేనా వాడి పారవేసే సంస్కృతి మానుకోరా అని తన ఆవేదనను వ్యక్తం చేశారు . కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనమంతా సంకల్పబధ్ధులం కావాలి అని పిలుపునిచ్చారు . ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన డా. కడవెండి వేణు గోపాల్ ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కలిగిస్తూ వాడటం వలన కలిగే నష్టాలను తెలియజేస్తూ గుడ్డ సంచులు విద్యార్థులకు పంపిణీ చేశారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube