టీ మీడియా ఎర్రుపాలెం క్రీస్తు మార్గం అనుసరణీయం : ఎర్రుపాలెం మండలం, ఎర్రుపాలెం లో బేతనియ గాస్పెల్ హల్ వారు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు గారు పాల్గొన్నారు…
డా.కోట రాంబాబు గారు మాట్లాడుతూ.. లోకంలో సమస్త ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని, ప్రపంచానికి ప్రేమ, కరుణ, దయతత్వాన్ని పంచి లోకానికి శాంతి సందేశాన్ని అందించిన దివ్య స్వరూపుడు ఏసు క్రీస్తు అని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ప్రజలందరి హృదయాలు ఆనందం, సంతోషంతో నిండాలని, భగవంతుని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ మహిళలకు చీరలను కానుకగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ ఆదాం ఏలిషా కోట గారు, జర్మనీ దేశం నుండి వచ్చిన సహోదరి క్రెస్టిల్ల గారు, పరిసర ప్రాంత పాస్టర్ లు మరియు సంగస్తులు తదితరులు పాల్గొన్నారు…
