అంగన్వాడీలపై ఎస్మా

ప్రభుత్వం ఆదేశాలు జారీ..

0
TMedia (Telugu News) :

అంగన్వాడీలపై ఎస్మా

– ప్రభుత్వం ఆదేశాలు జారీ..
-వేతనాల్లోనూ కోత

టీ మీడియా, జనవరి 6, విజయవాడ : అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కొన్ని వారాలుగా ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిందే. వారితో పలుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సేవల కిందకు తీసుకొస్తూ సర్కారు జీవో నంబరు2 జారీ చేసింది. ఆరు నెలల పాటు నిరసనలను నిషేధించింది. సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధిస్తున్నట్లు వివరించింది. అంగన్వాడీల వేతనంలోనూ ప్రభుత్వం రూ.3 వేల చొప్పున కోత విధించింది.ఎస్మా అంటే ఏంటి? అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం, సర్వీసులకు విఘాతం కలిగించేలా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించే అధికారం సర్కారుకు ఉంటుంది.

Also Read : టిడిపికి రాజీనామా చేస్తా : ఎంపీ కేశినేని నాని

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రయోగించే ఈ ఎస్మా చట్టం ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది.అంతేకాదు, ప్రభుత్వాం దాన్ని మరింత పొడిగించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగుల సస్పెన్షన్‌తో పాటు డిస్మిస్‌, జరిమానా, జైలు శిక్ష విధించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్మాను ఉల్లంఘించే పనులు చేస్తే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube