కనీస సౌకర్యాలు కల్పించలేని పెట్రోల్ బంక్ యాజమాన్యం

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 26, ఏటూరునాగారం రూరల్ :
ఏటూరునాగారం మండలకేంద్రంలో గల తెలంగాణ ఛత్తిస్గడ్ రెండు రాష్ట్రాలను కలుపుతూ ఏర్పడిన ప్రధాన జాతీయ రహదారి 163 ప్రక్కన గల ఎస్సార్ పెట్రోల్ బంక్ లో కనీససౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే గత రెండు సంవత్సరాల క్రితం అనుమతి పొందిన పెట్రోల్ బంక్ ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కనీససౌకర్యాలు త్రాగు నీరు, టాయిలెట్స్, ఎయిర్ పాయింట్ లు సౌకర్యవంతంగా లేకపోవడంతో కస్టమర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావున దీనిపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులు పెట్రోల్ బంక్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుకుంటున్నారు.

Essar Petrol bunk ownership that does not provide minimum facilities.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube