పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ

పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ

0
TMedia (Telugu News) :

పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ

టీ మీడియా, అక్టోబర్ 25, చింతూరు : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఏఎస్పీ మహేశ్వర రెడ్డి, ఓఎస్డి, చింతూరు సీఐ అప్పలనాయుడు ఆదేశాల మేరకు సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాల నివారణలో టెక్నాలజీ పాత్ర” అనే అంశంపై డొంకరాయి ఎస్సై శివ కుమార్ డొంకరాయి పోలీస్ స్టేషన్ సిబ్బందికి వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివ కుమార్ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిబ్బందికి వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా చాలా వేగంగా ఉందని, సమాచారం కూడా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, కానీ కొంతమంది తమ స్వార్థానికి సోషల్ మీడియా నీ ఆయుధంగా చేసుకుని నకిలీ పోస్ట్ లు చేయటం, నకిలీ సమాచారాన్ని సోషల్ మీడియా లో పెట్టడం ద్వారా నిజం కనుమరుగవుతుందని, నకిలీ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని పోలీసులు అభివృద్ధి చెందిన టెక్నాలజీతో పట్టుకొని చట్టపరమైనచర్యలు చేపడుతున్నారని అన్నారు. అదే విధంగా ప్రస్తుతం సమాజంలో కొంత మంది కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ ఐడిలు క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారనీ , బెట్టింగ్ ఆప్ లతో మోసాలకు పాల్పడుతున్నారనీ,

Also Read : ఈనెల 29న చంద్రగ్రహణం : ప్రముఖ ఆలయాలు మూసివేత

నకిలీ మెసేజ్ లు పెట్టీ బ్యాంక్ అకౌంట్ నుండీ డబ్బులు కాజేస్తున్నరని, అలాంటి నేరాలు చేసిన వారిని పోలీసు శాఖ పటిష్ఠమైన టెక్నాలజీ నీ వాడి పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాస రచన పోటీల్లో హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్, కానిస్టేబుల్స్ శ్రీను, సుధాకర్, కన్నప్ప రెడ్డి, పోసియ్యా, రామకృష్ణ, నాగరాజు లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube