బాధితులకు 10 లక్షల విలువైన నిత్యావసరాల పంపిణీ

బాధితులకు 10 లక్షల విలువైన నిత్యావసరాల పంపిణీ

0
TMedia (Telugu News) :

బాధితులకు 10 లక్షల విలువైన నిత్యావసరాల పంపిణీ.

టీ.మీడియా, ఆగస్టు3, చింతూరు:గోదావరి వరదల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లోని నాలుగు మండలాల్లో వరద తాకిడికి ప్రజలు నిర్వాసితులు గా మారి కనీసం నిత్యావసరాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్న వేళ నేనున్నాను అంటూ ఆఫ్రీన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ఖాన్ ముస్లిం సహోదర ట్రస్టు లఅందరినీ ఏకం చేసి నిర్వాసిత బాధలు తెలియజేసి ఆదుకోవాల్సిందిగా పిలుపునివ్వడంతో హైదరాబాద్ సహా యత్ ట్రస్ట్. రాజమహేంద్ర లోని అహలె హదీస్ వంటి ముస్లిం సంస్థలు ముందుకు వచ్చి నాయి. అంతేకాకుండా జమాతే ఫుల్ మాయే హింద్. ఢిల్లీ నుండి బట్టలు బియ్యం. వంటపాత్రలు మంచి నూనె కొవ్వొత్తులు తదితర సామాగ్రిని లారీల ద్వారా నిమ్మలగూడెం సాధించారు. వరద తగ్గుముఖం పట్టిన అనంతరం వరదలకు కుదిపేసిన కూనవరం వి.ఆర్.పురం మండలాల్లో తక్షణమే ట్రాక్టర్ల ద్వారా నిమ్మలగూడెం నుండి నేరుగా వరద బాధిత నిర్వాసితుల పునరావాస కేంద్రాలకు తరలించి అందజేశారు.

 

Also Read : చెత్త ట్రాక్టర్ డ్రైవర్ గా పంచాయతీ సెక్రటరీ

 

కట్టుబట్టలతో ప్రాణాలను అరచేత పట్టుకొని గుట్టలపై ఎక్కిన నిర్వాసితులు ఎడతెరిపి లేని వర్షానికి, బురద నీటికి గురై అనారోగ్యం పాలై జ్వరాల బారిన పడిన బాధితులకు డాక్టర్ జమాల్ ఖాన్ మందులను అందజేశారు. అంతేకాకుండా సరిహద్దు పొరుగు రాష్ట్రాలైన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా మోటు గ్రామంలో 30 కుటుంబాలకు బియ్యం. పప్పు ఉప్పు కారం పంచదార మంచి నూనె వంటివి అందజేశారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా కుంట గ్రామంలో ముంపుకు గురైన పాతబస్తీ సంత మార్కెట్ లలో నిర్వాసితులకు 500 కుటుంబాల వారికి నిత్యావసరాల ను అందజేశారు. వడ్డిగూడెం ధర్మ తాళ్లగూడెం నిర్వాసితులు రేకపల్లి గ్రామ శివారులో గుడారాలు వేసుకున్నా వారికి 500 మంది నిర్వాసితులకు నిత్యావసరాల అందజేశారు. చింతూరు మండల కేంద్రంలోని సంత పాకలు, ఎస్టీ. బిసి కాలనీలో వరదలకు కూలిపోయి నేలమట్టమైన నిర్వాసితులకు తాత్కాలిక పునరావాసం కోసం ఐదు వందల టార్పాలిన్ అందజేశారు. స్వయంగా తానే ఇంటింటికి తిరిగి ఎవరి ఇల్లు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకొని వారికి నేరుగా అందజేయడం జరిగింది. కుల మత జాతి వివక్షత లేకుండా అందరూ సమానమే అంటూ కష్టకాలంలో అందరూ బాధితులకు సహకరించాలని మానవసేవయే మతాల కన్నా మహోన్నతమైన దని ప్రజలకు చెబుతూ మరింత సహాయాన్ని నిర్వాసితులకు అందించాలని జమాల్ ఖాన్ కోరుతున్నారు. మరికొద్ది రోజుల్లో దాతలు ముందుకు వచ్చి మరింత సాయం అందించే అవకాశం ఉందని తప్పకుండా నిర్వాసితులు అందరికీ ఆకలిదప్పులు తీర్చే అవకాశం అల్లా తనకు ఇచ్చాడని తనతోపాటు సహకరించిన స్వచ్ఛంద సంస్థ ఆశ ప్రతినిధి సుభాని. చింతూరు మసీద్ ఇమామ్ రెహమాని. తోటి సహోదరులు పాల్గొన్నారని వారందరికీ జమాల్ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube