స్వచ్చంద సేవా సంస్థ నిత్యవసర లు పంపిణీ
టి మీడియా, జులై 23 వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకులబోరు ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదానంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు తదితరులు ఆ గ్రామానికి చేరుకొని 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె , కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఇందులో భాగంగా కృష్ణబాబు మాట్లాడుతూ గోదారి వరదల వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని మరి వీరికి ఇంకా కొంతమంది మానవతవాదులు గాని స్వచ్ఛంద సంస్థలు గాని ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు.
ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు యూత్ అమ్మ స్వచ్చంద సేవా సంస్థకి ఎంతో రుణపడి ఉంటామని ఎంతో పెద్ద మనసు చేసుకొని మాకు సాయం అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు బోధ బోయిన పరమేశ్వరరావు, సర్పంచ్ సూరిబాబు , గడ్డం వివేక్, రాఘవులు, బి తిరుపతి , వెంకట కృష్ణ , కిషోర్ , శేఖర్ , మోహన్ రావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube